KCR | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం దైవచింతనను, ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి దర్పణంగా ఉన్న తెలంగాణ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణకు ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలిపారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పదేండ్ల బీఆర్ఎస్ పాలన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసే ముస్లింల కలలు సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు.