హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘మహిళలు తొమ్మిది రోజులు పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని, వేడుకల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళల కష్టాలన్నీ తొలిగి, ప్రతీ ఇల్లు సుఖసంతోషాలతో నిండేలా ప్రకృతిమాత దీవెనలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.