హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక భక్తి భావన వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం గంగా జమున తహెజీబ్‌కు దర్పణంగా నిలుస్తుందని వెల్లడించారు. రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా ప్రజల నడుమ శాంతి సామరస్యాలు, సౌభ్రాతృత్వ భావనలు మరింతగా పెంపొందాలని, ఆ దేవుని కృప ప్రజలందరి మీద ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.