నల్లగొండ, నవంబ ర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్కు ప్రజల సంపూ ర్ణ మద్దతు ఉన్నదని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కా వడం లాంఛనమేనని శాసన మండలి చైర్మన్ BRS గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
దేశంలోనే గొప్ప విజన్ ఉన్న నేత కేసీఆర్ అని, ఆయన నాయకత్వంతో తెలంగాణ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కర్ణాటకలో అమలు కావడం లేదని దుయ్యబట్టారు. ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నల్లగొండ ప్రజలు నాలుగు సార్లు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.