హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ కగార్‌ను కేం ద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ కోరారు. కగార్ పేరుతో గిరిజనుల ఊచకోత తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ కేం ద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు తో ఛత్తీస్‌గఢ్‌లో యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నది. అది ధర్మం కాదు. నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నరు. మేము ప్రభుత్వం దగ్గరికొచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నమని అంటున్నరు. నేను కేంద్రా న్ని కోరుతున్నా. బలం ఉందికదా అని చంపుకుంటు పోవడం కాదు. అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయండి. నక్సలైట్లను పిలిచి డెమొక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్లు ఏమి మాట్లాడుతరో చూడండి. అదిగూడ నల్లనా తెల్లనా దేశం ముందటికి రానీయండి. అట్లకాదు, మొత్తం నరికి పారేస్తం, కోసి పారేస్తం అంటే ఎలా? మిలట్రీ మీదగ్గర ఉన్నది కాబట్టి కొడతరు. కానీ అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరంతా చప్పట్లు కొడితే తీర్మానంగా భావించి కేంద్రానికి పంపిద్దాం.. కేసీఆర్ ఈ సంద ర్భంగా పిలుపునిచ్చారు.