హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి గురువారం సోమాజిగూడలోని యశోద దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
సాయంత్రం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయి తిరిగి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. గతవారం జరిగిన వైద్య పరీక్షలకు ఇవి ఫాలోఅప్ మాత్రమేనని వైద్యులు తెలిపారు.