KCR | హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావుకు భారతరత్న ప్రకటించడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల ఎక్స్ వేదికగా కేసీఆర్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోదీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో షంతోషాన్ని కలిగించింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
“Thanks to Hon’ble PM Sri @narendramodi ji for conferring the Nation’s highest award, ‘Bharat Ratna,’ to former PM Sri PV Narasimha Rao garu. The people of Telangana rejoice in the decision of PM Narendra Modi ji”: Sri KCR, President, Bharat Rashtra Samithi. pic.twitter.com/l5hzvpsJx9
— BRS Party (@BRSparty) February 9, 2024