హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, పిల్లల ఆటపాటలతో తొమ్మిదిరోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొన్నదని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.