మేడ్చల్, జనవరి25 (నమస్తే తెలంగాణ): సోదరి చీటి సకలమ్మ అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ శనివారం సోదరి నివాసప్రాంతమైన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌కు చేరుకొని పార్థివదేహానికి నివాళులర్పించారు. మునీరాబాద్‌కు చెందిన వైకుంఠధామంలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కేసీఆర్ అక్కడే ఉన్నారు. సకలమ్మ కుటుంబసభ్యులను ఓదార్చారు.
అంతిమయాత్రలో సకలమ్మ పాడెను హరీశ్‌రావు మోశారు. అంత్యక్రియలకు కేటీఆర్, కవిత, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, రవిచంద్ర, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, నందికంటి శ్రీధర్ హాజరయ్యారు.