KCR | ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ తదిరత రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరు కావాలని ఆహ్వానించారు.