Russian Diplomat: నలుగురు భారతీయ నావికులు మృతి.. రష్యా దౌత్తవేత్తకు సమన్లు జారీ
Russian Diplomat: రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. ఒడెసా పోర్టులో నౌకపై రష్యా దాడి చేసింది. ఆ ఘటనలో నలుగురు భారతీయ నావికులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఉన్న దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయులు మరణించారు. ఒడెసా పోర్టు(Odesa Port) లోని నౌకపై రష్యా క్షిపణులతో విరుచకుపడింది. 10 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో నలుగురు భారతీయులే ఉన్నారు.ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్‌కు సమన్లు జారీ చేశారు. భారతీయ నావికుల్లో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నలుగురు భారతీయుల మృతికి కారణమైన రష్యా దాడిన ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఆదివారం ఎమ్వీ గోల్డెన్ లియో (MV Golden Leo) అనే నౌక 17 మంది సిబ్బందితో ఒడెసా పోర్టు నుంచి బయల్దేరింది. ఈ నౌకపై రష్యా దాడి చేయడంతో పది మంది చనిపోయారని విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యా దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య పడవలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరులను చంపడం సమంజసం కాదని.. అలాంటప్పుడు జల స్వేచ్ఛ రవాణా, వాణిజ్యంను నిలిపివేయాలని రష్యాను కోరింది.
టర్కీకి చెందిన కార్గో నౌక గోల్డెన్ లియాపై దాడి జరిగింది. కేహెచ్-59-కేహెచ్ 69 రకం క్రూయిజ్ క్షిపణులతో రష్యా అటాక్ చేసినట్లు ఉక్రెయిన్చెప్పింది.వీటిల్లో ఓ క్షిపణి.. గోల్డెన్ లియోను ఢీకొన్నట్లు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

