KCR | భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమవేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని.. మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని నేతలకు సూచించారు.
సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కే ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్, మాణిక్ రావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన నేతలు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్న గారిజీవన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఆయేషా షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.