హైదరాబాద్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేక ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకొని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకమని చెప్పారు. కష్టాలన్నీ తొలగి, ప్రతి ఇల్లూ సుఖసంతోషాలతో నిండేలా, ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని కేసీఆర్ ప్రార్థించారు.