హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కేసీఆర్ కోరుకున్నారు. చంద్రబాబు నాయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌఖ్యాలతో ప్రజాసేవలో మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.