హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) కేంద్రంలో బీజేపీ మేజిక్ ఫిగర్‌కు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎలాగైనా అధికారం చేపట్టాలనే తలంపుతో ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇండియా కూటమి నేతలు ఏపీలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఒడిషాలో నవీన్ పట్నాయక్‌ను కలువనున్నారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్‌ను కలువనున్న సమాచారం. కాగా, జూన్ 9 లేదా 10వ తేదీన కొత్తగా ఎన్నికైన ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో రాష్ట్రపతి భన్‌లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను దిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.