హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడిందని, అందుకే బీఆర్ఎస్ను, మాజీ మంత్రులను విమర్శిస్తున్నదని బీఆర్ ఎస్ శాసనసభ విప్ కేపీ వివేకానంద గౌడ్ చెప్పారు. ‘కేసీఆర్ సర్కారు హయాంలో ప దేండ్లు ఎంపీ, ఎమ్మెల్సీ వంటి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు కవితకు ఇప్పుడెందుకు వస్తున్నయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఎలాంటి సంబంధం లేదని, తీరా ఫలితాలు వచ్చాక బీఆర్ఎస్పై, మాజీ మంత్రులపై ఆమె వ్యతిరేక వ్యాఖ్యలు చే యడం ఏమిటీ?’ అని ప్రశ్నించారు. అ లాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరి ప్రయోజనాల కోసమని నిలదీశారు. ఈ విషయం తో కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలని హిత వు పలికారు. తెలంగాణ భవన్లో ఆదివా రం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడారు. కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మేలు చేస్తున్నట్టు అనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నాయకులు చేసిన అరాచకాలు, రౌడీయిజం కవితకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ‘సొంత పార్టీ పెడితే పెట్టుకోండి.. కానీ, ఈ క్రమంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలి’ అని హితవు పలికారు.
కేసీఆర్ కూతురిగా బీఆర్ఎస్లో, నాయకులు, కార్యకర్తల్లో ఆమెకు గౌరవం ఉన్నదని, పార్టీలో సముచిత స్థానం కల్పించారని వివేకానంద గుర్తుచేశారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ కార్యకర్తల పోరాటాలు చిన్న గా చేసి మాట్లాడారు. మరి కాంగ్రెస్ నేతల అధికార దుర్వినియోగం, రౌడీయిజం.. అ రాచకాలు కనిపించలేదా?’ అని ప్రశ్నించా రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను ఉద్దేశించి కృష్ణార్జునులు అని సంభోధిస్తూ సెటైర్లు వేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్దే గెలుపు అన్న టాక్ వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తాము ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతోనే నియోజక వర్గంలో గల్లీగల్లీ తిరిగారని, ఈ క్రమంలో మైనార్టీ ఓట్ల కోసం అజారుద్దీన్‌కు హుటాహుటిన మంత్రి పదవి కట్టబెట్టారని, ఈ విషయం కవితకు తెలియదా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయనే తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ ప్రజానీకం ముక్తకంఠంతో కోరుకుంటున్నదని వివేకానంద స్పష్టం చేశారు. అలాంటాయనకు కూతురుగా ఉన్న కవిత బీఆర్ఎస్కు, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు వ్యతిరేకంగా మాట్లాడటం మంచి సంప్రదాయం కాదని, సభ్యసమాజం కూడా తప్పుగా భావిస్తుందని కేపీ పేర్కొన్నారు.