మక్తల్, ఏప్రిల్ 10 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం మక్తల్ మండలం కాట్రేవుపల్లిలో చేస్తున్న భూసేకరణను తమ భూములు మినహాయించాలని కోరుతూ గురువారం నారాయణపేట కలెక్టరేట్‌కు చేరుకొన్న రైతులు కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాట్రేపల్లి రైతు కేశవ్ మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ హయాంలో భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణంలో కాట్రేపల్లికి చెందిన రైతుల భూములు 90 శాతం కోల్పోయినట్టు గుర్తుచేశారు. మిగిలిన 10 శాతం భూములు సైతం ప్రస్తుతం చేపట్టిన కొడంగల్ లిఫ్ట్‌లో కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ జీవన విధానాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కలెక్టర్‌కు విన్నవించారు.