కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీ(Congress)లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు పార్టీ ఆఫీసులను ధ్వంసం చేస్తూ..రేవంత్ రెడ్డి దిష్టిమ్మలు తగలబెడుతూ తమ నిరసనలను తెలుపుతున్నారు. మరోవైపు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన కాసుల బాలరాజు(Kasula Balaraju) టికెట్ రాలేదని తీవ్ర నిరాశకు లోనైన పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.
గత పడేండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కాసుల బాలరాజును కాదని పార్టీ అధిష్ఠానం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రవీందర్ రెడ్డి కి కేటాహించింది. దీంతో బాన్సువాడలో కాసుల బాల్ రాజు ఆమరణ దీక్ష చేపట్టారు. ఇంట్లోకి వెళ్లి మోనో క్రోటోఫాస్ రసాయన పురుగుల మందును సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.
వెంటనే పార్టీ కార్యకర్తలు అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ క్యాడర్‌ను సైతం అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతున్నారో తెలియక అధిష్ఠానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.