Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుండగా ఆయన్ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు.
కరీంనగర్లో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఫిర్యాదు చేయడంతోపాటు సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్టీవో ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్‌లోని ఒకటో పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదుచేశారు. ఈ కేసుల నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు.
ఆదివారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం వాడివేడిగా జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యేను కౌశిక్‌రెడ్డి పలు ప్రశ్నలతో నిలదీశారు. ‘నువ్వు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడివి. నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పాలి? అని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ దూషించుకున్నారు. ఆదివారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం వాడివేడిగా జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యేను కౌశిక్‌రెడ్డి పలు ప్రశ్నలతో నిలదీశారు. ‘నువ్వు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడివి. నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పాలి? అని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ దూషించుకున్నారు.