కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తున్నది. తనకు సన్నిహితంగా ఉండే పది మంది కార్పొరేటర్లతో కలిసి శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని మేయర్ సన్నిహిత వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.