పెద్దపల్లి/ గంగాధర, మే 12 : గంగాధర ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ మంద కిరణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిరుడు పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో రూ.లక్షకుపైగా లంచం తీసుకున్నట్టు తేలడంతో తాజాగా నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ వివరాల ప్రకారం..
గంగాధర ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న మంద కిరణ్‌కుమార్ గతేడాది పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్వో)లో సీనియర్ అసిస్టెంట్‌గా, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించాడు. గత నవంబర్ 14న ఏసీబీ అధికారుల తనిఖీ సమయంలో కిరణ్‌కుమార్ తన ప్రైవేట్ అసిస్టెంట్ బిట్టు అలియాస్ రత్నకుమార్ ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి నుంచి ముడుపులు స్వీకరించినట్టు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.