BRS | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ లోక్‌సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు దీనికి హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసి, వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు.
మొదటి రోజు ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో లిఖిత పూర్వక సూచనలు, సలహాలు స్వీకరించారు. దాదాపుగా 26 మందికి పైగా మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలిపారు. సన్నాహక సమావేశంతో పార్టీ కేడర్‌తో నూతనోత్సాహం నెలకొంది. ఈ సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.