e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ఈట‌ల‌కు ఎదురుదెబ్బ‌.. సొంత మండ‌లంలోనే తిరుగుబాటు

ఈట‌ల‌కు ఎదురుదెబ్బ‌.. సొంత మండ‌లంలోనే తిరుగుబాటు

ఈట‌ల‌కు ఎదురుదెబ్బ‌.. సొంత మండ‌లంలోనే తిరుగుబాటు

క‌రీంన‌గ‌ర్ : ఈట‌ల రాజేంద‌ర్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం త‌న‌దే అని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న ఈట‌ల‌కు సొంత మండ‌లంలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్‌లో ఉండ‌గానే.. సొంత మండ‌ల‌మైన క‌మ‌లాపూర్‌లో ఎంపీటీసీలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆరే త‌మ నాయకుడు అని క‌మ‌లాపూర్ మండ‌ల ప‌రిధిలోని ఎంపీటీసీలు తేల్చిచెప్పారు. తామంతా టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచాం. కాబ‌ట్టి సీఎం కేసీఆర్ వెంటే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

సీఎం కేసీఆర్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు అందుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఈట‌ల రాజేంద‌ర్ బీసీల‌కు చేసిందేమీ లేద‌ని తేల్చిచెప్పారు. ముదిరాజ్ బిడ్డ‌ను అని చెప్పుకునే ఆయ‌న ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి చేయ‌లేద‌న్నారు.

ఈ స‌మావేశంలో క‌మ‌లాపూర్ ఎంపీటీసీల ఫోరం అధ్య‌క్షులు ఎర్ర‌బెల్లి సంప‌త్ రావు, మిగ‌తా ఎంపీటీసీలు తూర్పాటి అరుణ క్రాంతి కుమార్, గుర్రం వెంక‌టేశ్వ‌ర్లు, గుబిరె సుగుణాక‌ర్ రావు, ప‌స‌ర‌గొండ శైల‌జ నాగేంద‌ర్, ఇజంప‌ల్లి రామ‌స్వామి, అర‌కుల లింగారెడ్డి, బండ యాద‌గిరి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈట‌ల‌కు ఎదురుదెబ్బ‌.. సొంత మండ‌లంలోనే తిరుగుబాటు

ట్రెండింగ్‌

Advertisement