Ranganayaka Sagar | తెలంగాణకు ప్రాణధార కాళేశ్వరమే. ఆ జలరేఖను చెరిపేయలేరనేది వాస్తవం. రంగనాయక్‌సాగర్‌లో ఉప్పొంగుతున్న గోదావరిని జలతరంగ దృశ్యానికీ సాక్ష్యమీ చిత్రం. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సోమవారం ఎక్స్‌వేదికగా ఈ ఏరియల్ ఫొటోను షేర్ చేశారు. ‘వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, రంగనాయకసాగర్‌కు చేరిన గోదావరిగంగ.
ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం. అద్భుత జల సౌందర్యం. కాళేశ్వరాన్ని బద్నాం చేస్తున్న కబోదుల్లారా.. కన్నులు తెరిచి ఈ సుందర దృశ్యం చూడండి. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని గుర్తించండి’ అని ఆయన పేర్కొన్నారు. అపర భగీరథుడు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ నిండు కుండలా మారిన దృశ్యమని, ప్రతీనీటి చుకలో ఉన్న కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయలేమని తేల్చిచెప్పారు.