సిద్దిపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు దండుగ అన్న రు.. ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదన్న రు.. రైతులకు ప్రయోజనమే కలగలేదన్నరు.. తీరా ఇప్పుడు ఆ నీళ్లనే రైతుల పొలాల్లోకి పారిస్తున్నదీ కాంగ్రెస్ సర్కారు. ప్రాజెక్టు వృథా అని ఏ నోట అన్నారో, అదే నోట కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నమని స్వయంగా ఒప్పుకొంటున్నరు. రిజర్వాయర్లలోని గోదావరి జలాలు, కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న గోదారమ్మను చూశాక కాంగ్రెస్ మంత్రులకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల నుంచి కాల్వల ద్వారా చెరువులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ఇటీవల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, బటన్ నొక్కి సాగు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్లలో గోదావరి జలాలను చూసి మంత్రి ముఖంలో సంతోషం, ఉత్సాహం కనిపించాయి. కాళేశ్వర ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల రైతులకు ఊరట క లిగించే విషయమని, కొంత ఆలస్యమైనా రై తుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నీటిని వి డుదల చేసినట్టు ఆమె చెప్పారు. రంగనాయక సాగర్ ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. మరి కాళేశ్వ రం ద్వారా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందటం లేదని చెప్పిన కాంగ్రెస్ నాయకు లు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి నో టితోనే రంగనాయక సాగర్ నుంచి 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని చెప్తున్నారు. వాస్తవాలు చూశాక వారి మనసు మార్చుకున్నారేమే అనిపిస్తున్నది.
కేసీఆర్ భగీరథ ప్రయత్నం
ఒకనాడు కరువుతో అల్లాడిన మెతకుసీమకు గోదావరి జలాల రాకతో రైతులు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడి, భగీరథ ప్రయత్నం చేసి ఉమ్మడి మెదక్ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చారు. ఫలితంగా గడిచిన నాలుగేండ్ల నుంచి రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. ఏ రైతును అడిగినా ఇదే విషయం చెప్తా రు. చేసిన పనులు కండ్ల ముందట కనిపిస్తున్నా యి. ఏటా యాసంగి సాగుకు పుష్కలంగా గో దావరి జలాలను కేసీఆర్ ప్రభుత్వం అం దించి పంటలు ఎండిపోకుండా కాపాడింది. ఈ ఏడా ది యాసంగి సాగు ప్రారంభమై నెల దాటినా రైతులకు సాగునీటిని విడుదల చేయకపోవటం తో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వ యంగా నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. మళ్లీ వారం, పది రోజుల తర్వాత మంత్రికి ఫో న్ చేసి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఉత్తరం కూడా రాశారు. దీంతో నీటిని విడుదల చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. హరీశ్‌రావు చొరవతో ఎట్టకేలకు బుధవారం మం త్రి కొండా సురేఖ సాగునీటిని విడుదల చేశా రు. హరీశ్‌రావు చొరవపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కష్టపడిన నేత హరీశ్‌రావు అని, నీటి విడుదల సమయంలో లేకపోవటం తమకు బాధగా ఉన్నదని పలువురు రైతులు పేర్కొన్నారు. జిల్లాలో మరోవైపు అనధికార కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. దీంతో సాగుచేసిన పం టలు చేతికి వస్తాయా? లేదా? అన్న ఆందోళనలో రైతులున్నారు. గత యాసంగితో పోలి స్తే ఈసారి పంటల సాగు తగ్గినట్టు తెలుస్తున్నది.