హైదరాబాద్ జూన్ 12 (నమస్తే తెలంగాణ) : మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఉమ్మడి పాలనలో దండగులా మారిన వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగులా తీర్చిదిద్దారని ప్రశంసించారు. గురువారం కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో ఏరువాక పౌర్ణమి ముగింపు ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం నిర్మించి 2.42 కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చి రైతుల కన్నీళ్లు తీర్చిన యోధుడు కేసీఆర్ అని కిర్తీంచారు. అంతటి ఘనత వహించిన కేసీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలనా వైఫల్యాలతో ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల నాటకం మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ త్యాగాలు, ఆనవాళ్లను ఎప్పటికీ చెరిపెయ్యలేరని స్పష్టంచేశారు
.