కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే.. రేవంత్‌ను రైతులు ఉరికిచ్చి కొడ్తరు.. హుస్నాబాద్‌లో బీ వినోద్
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేపట్టి మెట్ట ప్రాంతాలకు నీళ్లందించకపోతే రైతులు, ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హెచ్చరించారు.
- కరువు వస్తే కాళేశ్వరమే దిక్కు
- కాంగ్రెస్, బీజేపీ స్వార్థ రాజకీయాల వల్లే పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయింది
హుస్నాబాద్, ఏప్రిల్ 18: కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేపట్టి మెట్ట ప్రాంతాలకు నీళ్లందించకపోతే రైతులు, ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హెచ్చరించారు. తెలంగాణకు కరువు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప వేరే ఆధారం లేదని గుర్తించేందుకు ముఖ్యమంత్రికి రెండున్నరేండ్లు పట్టిందని దుయ్యబట్టారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మేడిగడ్డ వద్దనే నీటివనరులు ఎక్కువ అని గుర్తించే అప్పటి సీఎం కేసీఆర్ అక్కడ బరాజ్ నిర్మించినట్టు చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు ప్రజలకు అర్థమవుతున్నాయని, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం ఖాయమని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ శాపంగా మారాయని విమర్శించారు. వారి స్వార్థ రాజకీయాలు, అహంకారం వల్లే బిల్లు వీగిపోయిందని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

