
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేక.. త మ ఉనికిని కా పాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కడియం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్తును చూసి కేంద్రం అభినందిస్తుంటే.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నా యకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, కాం గ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అ మలవుతున్న పథకాలు ప్రవేశపెట్టి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.