హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress)లో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తానే రెండో స్థానం అంటున్నాడు. 2028లో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్లో కేటీఆర్, హరీశ్ రావు కృష్ణార్జునులని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అగ్ర నాయకత్వం అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. దళితబంధు పథకాన్ని ఆపటం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేయాలని ఆయన సూచించారు.