హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కే లక్ష్మీనర్సింహారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మంగళవారం నియమించారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్‌గా వ్యవహరించిన కుసుమ జగదీశ్ ఇటీవల మృతిచెందడంతో నూతన అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది.
జడ్పీ చైర్‌పర్సన్‌గా తాడ్వాయి జడ్పీటీసీ బడే నాగజ్యోతిని నియమించటమే కాకుండా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ములుగు అసెంబ్లీ నిజయోజకవర్గ అభ్యర్థిత్వం కేటాయించారు. ఈ క్రమంలో ములుగు జిల్లాలో పట్టున్న, పార్టీ శ్రేణుల్లో సమన్వయకర్తగా పేరున్న కే లక్ష్మీనర్సింహారావును సీఎం కేసీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.