నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి రిమాండ్ విధించాలన్న విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. పోలీస్ అధికారిని బెదిరించినట్టు, ఆయన విధులకు ఆటం కం కలిగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌశిక్‌రెడ్డిని గురువారం రాత్రి పోలీసులు 3వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. కౌశిక్‌రెడ్డిపై వచ్చిన అభియోగాలకు, ఆయనపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు పొంతన లేదని బీఆర్ఎస్ లీగల్‌సెల్ న్యాయవాదులు జడ్జికి తెలిపారు. ఏడేండ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న ఈ కేసులో నిందితుడికి బీఎన్ఎస్ఎస్లోని 35(2) సెక్షన్ (గతంలో సీఆర్పీసీ 41ఏ సెక్షన్) ప్రకారం నోటీసులు ఇవ్వకుండా రిమా ండ్‌కు తరలించడం చట్టవిరుద్ధమని వివరించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. పోలీసుల రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. రూ.5 వేల చొప్పున ఇద్దరి జమానత్‌లను సమర్పించాలని కౌశిక్‌రెడ్డిని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు కౌశిక్‌రెడ్డి శుక్రవా రం తన న్యాయవాది జక్కుల లక్ష్మణ్ ద్వారా ఇద్దరి జమానత్‌లను కోర్టుకు సమర్పించడం తో.. ఫిబ్రవరి 2న కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి కౌశిక్‌రెడ్డికి సూచించారు. దీం తో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, జైలుకు తరలించాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.
కొడంగల్, డిసెంబరు 6: లగచర్ల ఘటనపై విచారణ నిమిత్తం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు తరలించిన పోలీసులు.. విచారణ నిమిత్తం ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం కొడంగల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అనంతరం రెండ్రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్టు ప్రకటించిన కోర్టు.. నరేందర్‌రెడ్డిని ఆయన న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశించింది.