Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఆమోదం తెలిపింది. ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ సోమ భరత్ కుమార్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు.. వారికి వాహనాల అనుమతికి పాస్‌లను మంజూరు చేశారు. ఈ ఎన్నికల ప్రచారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు సైతం ఉన్నది. అలాగే, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీ శ్రీనివాస్ యాదవ్, వీ ప్రశాంత్ రెడ్డి, జీ జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి ఉన్నారు. మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీ శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ సైతం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్లు టీ పద్మారావు గౌడ్, పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎం కృష్ణ రావు, కేపీ వివేకానంద గౌడ్, డీ సుధీర్ రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశం, పాడి కౌశిక్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్ జాదవ్, బండారు లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, చింతా ప్రభాకర్ సైతం స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు.
ఎమ్మెల్సీల్లో దాసోజు శ్రవణ్, ముఠా గోపాల్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టాటా మధుసూధన్, ఎల్ రమణా, తక్కెలపల్లి రవీందర్ రావు ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణు వర్ధన్ రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షేక్ అబ్దుల్లా సోహైల్ పేర్లు సైతం ఉన్నాయి.
Star campaigners List
Star campaigners List