హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కారు ఢిల్లీకి ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. రేవంత్ రెడ్డి లెక్కల్లో వీక్ అని.. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో లెక్కలు చూస్తే తెలుస్తుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని నడ్డా విమర్శించారు.
రాష్ట్ర బీజేపీలో డోర్స్ ఓపెన్ చేయాలని, వేరే పార్టీవాళ్లు చేరితేనే బీజేపీకి బలం అని పేర్కొన్నారు. పార్టీలో చేరికలను అడ్డుకోవద్దని నేతలను హెచ్చరించారు. కార్యకర్తలతో సఖ్యతగా లేకుంటే ఇబ్బందులు తప్పవని హితవు పలికారు. పార్టీలో కొత్తవాళ్లని కలుపుకొనిపోవాలని, పాతవాళ్లతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. అంతకుముందు ఆయన బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. అనంతరం మేధావుల సదస్సులో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రస్తుతం 87% పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి 100% నిర్మాణాలు పూర్తి చేసి, అన్ని సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర అరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు. గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎయిమ్స్ సంస్థలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభించిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్‌కే దకిందని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ఓపీడీ విభాగంలో అన్ని ప్రధాన స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇకడ ప్రతిరోజూ 1,800 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఇకడ పీఎం-జైతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నామని తెలిపారు.