సిరిసిల్ల/వేములవాడ : సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక గంట గడిచిపోయినా కౌంటింగ్‌కు సంబంధించిన ఫొటోలుగానీ, వీడియోలు గానీ బయటికి ఇవ్వకపోవడంపై అక్కడి జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అధికారుల వైఖరిని తప్పుపడుతూ వేములవాడలో రోడ్డుపై బైఠాయించారు. సిరిసిల్లలో కౌంటింగ్ కేంద్రం ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.
వేములవాడలో జర్నలిస్టులు కౌంటింగ్ వీడియోలు వెయ్యకపోవడంపై ప్రశ్నించగా.. సిరిసిల్ల కౌంటింగ్ వీడియోలు వాడుకోవాలంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వేములవాడ జర్నలిస్టులు తెలిపారు. అటు సిరిసిల్లలో కూడా వీడియోలు బయటికి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ రెండుచోట్లా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.
