ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు శనివారం అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవెల్లిలోని నివాసానికి వెళ్లిన నేతలు అధినేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్, నల్లమోతు భాసరరావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బూడిద భిక్షమయ్యగౌడ్, బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, పాల్వాయి స్రవంతి, రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పల్లె ప్రవీణ్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, వలమల కృష్ణ, నూకల యుగంధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
– హైదరాబాద్(నమస్తే తెలంగాణ)