హుజురాబాద్ : వీణవంక మండలం గున్ముక్ల సొసైటీ డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా హుజురాబాద్ నియోజకవర్గ తెలంగాణరాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు కమలాపూర్ లో ఘనంగా జరిగాయి. కమలాపూర్ మండలంలో టిఆర్ఎస్ కార్యకర్తలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటారు.