Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో చేరడం పక్కా : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Jeevan Reddy | రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల : రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ ( KCR ) పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy ) అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలన తిరోగమనంలో నడుస్తుందని వెల్లడించారు. గురువారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి రైతును గత ప్రభుత్వం ఆదుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను ఏనాడు పట్టించుకోలేదు.ప్రజలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన తర్వాత బెటర్ పాలన కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్కు ప్రచార ఆర్భాటాలు తప్ప, ప్రజాహితంగా కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా అమలు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. దీని ద్వారానే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు.
రాష్ట్రస్థాయిలో పోల్చుకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్తోనే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమైందని అన్నారు.రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలనుకుంటున్నారని తెలిపారు.బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.దీనికి కార్యరూపం ఏవిధంగా ఉండాలనేది కేటీఆర్ నిర్ణయిస్తారని,దానికి అనుగుణంగా ముందుకెళతానని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

