సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) అన్నారు. బుధవారం హుజుర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు, 14 వ వార్డుకి చెందిన వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరాయి. వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతందన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అమరనాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, యూత్ అధ్యక్షుడు సోమగాని ప్రదీప్, 13 వ వార్డు ఇన్చార్జి మీసాల కిరణ్,14 వ వార్డు అధ్యక్షుడు అల్వాల నరేష్, మామిడి వసంత్,18 వ వార్డు కౌన్సిలర్ కుంట ఉపేంద్ర సైదులు, కొల్లపూడి చంటి, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.