మెదక్ : మెదక్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముందుకెళ్తున్నారు. అంతేకాదు పేదల కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతున్నారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ బీఆర్ఎస్లో వెల్లువలా చేరుతున్నారు.
తాజాగా శుక్రవారం మెదక్ మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెద్ద సత్తయ్య, ప్రవీణ్ సాయిబాబా రమేష్, కిష్టయ్య, అంజయ్య, రాజు, అంబాద్రి, సిద్ధి రాములు, కిశోర్, జనార్ధన్, మహేష్, సాయిలు, మైపాల్, వెంకట్ రాములు, యాదగిరి, తులసీ రామ్, రవి లాల్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వై స్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.