కందుకూరు, సెప్టెంబర్ 1 : ప్రజలు ప్రతి పక్షాలను నమ్మరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరడు గట్టిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడంతో జాతీయ పార్టీలు బేజారు అవుతున్నాయని చెప్పారు. దీంతో ఆ పార్టీలకు భారీ షాక్ తగులుతున్నట్లు పేర్కొన్నారు.
రంగాడ్డి జిల్లా కందుకూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్తో బాచుపల్లి,లేమూరు, దెబ్బడగూడ గ్రామాలకు చెందిన 150 మంది కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామాలు చేసి మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని వివరించారు. పార్టీలు ముఖ్యం కాదని, అభివృద్ధి ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి పక్షాలను నమ్మి మోసపొవద్దని కోరారు. ఆ పార్టీలను నమ్మి మోసపోతే గోసపడుతారని తెలిపారు. అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు.
కల్లి బొల్లి మాటలను నమ్మవద్దని కోరారు. అధికారంలోకి రావడానికి అములు కాని మాటలను చెబుతున్నారని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతి గడపు ప్రభుత్వ పథకాలు చేరాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రసిడెంట్ ఎలుక మేఘనాధ్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, లేమూరు సర్పంచ్ జంగిలి పరంజ్యోతి ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.