మెదక్ : మెదక్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ చంద్రకళ రవి యాదవ్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మెదక్ మండలం మాజీ జడ్పీటీసీ కిషన్ గౌడ్ కూడా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు సరైన గౌరవం లభిస్తుందన్నారు.
కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేసి బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ యం.లావణ్య రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ యం.దేవేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ పట్టణ, మెదక్, హవేళిఘనాపూర్ మండలాల, పార్టీ అధ్యక్షులు యం.గంగాధర్, యం. అంజ గౌడ్, సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు, నాయకులు లింగారెడ్డి, రవీందర్ రాములు తదితరులు పాల్గొన్నారు.