వీణవంక, అక్టోబర్ 11 : బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మండలి విప్, హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy )పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు, బ్రాహ్మణపల్లికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగాలంటే సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకం అందని గడప లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో మరో మోసానికి తెరతీసిందని విమర్శించారు.
ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారంలో కూరుకుపోతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, తదితరులు పాల్గొన్నారు.