సీఎం కేసీఆర్ జనరంజక పాలన, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి పడిగెల, సావెల్ గ్రామాలకు చెందిన సుమారు 160 మంది రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
శుక్రవారం వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.