ఎదులాపురం, మే 13: పోక్సో కేసు నమోదైనప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నించారు. బుధవారం ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధితురాలి పక్షాన ప్రభుత్వం నిలబడకపోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు.
తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని చెబుతున్న బండి సంజయ్.. తన కుమారుడు ఎందుకు పరారీలో ఉన్నాడో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.