హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారీగా ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి దామోదర నివాసంలో బుడగజంగాల నాయకులు, యువకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ కులాల్లో బుడగ జంగాల అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఈ కులాన్ని గ్రూప్-1లో చేర్చినట్టు స్పష్టంచేశారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతాయని తెలిపారు.