హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లు గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్టు పోస్టులు ఉన్నాయని బోర్డు అధికారులు తెలిపారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48, స్పీచ్ పాథాలజీ పోస్టులు 4 ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
జూలై 12 నుంచి 25 వరకు పాథాలజీ పోస్టులకు, జూలై 14 నుంచి 25 వరకు డెంటల్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం (https:// mhsrb.telangana. gov.in/MHSRB/home.htm) సంప్రదించాలని సూచించారు.