Job Mela | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫార్మసీలో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ చేసిన వారికి ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టీ రాము తెలిపారు.
అపోలో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాను ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు అభ్యర్థులు బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్లతో నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద హాజరు కావాలని అయన ఒక ప్రకటనలో కోరారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
Sanjay Raut | పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష