ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 31 : రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్నాయక్ మాట్లాడుతూ.. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపబోమని తెగేసి చెప్పారు. ఎమ్మెల్సీ ఎ న్నికల్లో ‘కాంగ్రెస్ పార్టీకో హఠావో- జాబ్ క్యాలెండర్కో బచావో’ నినాదంతో ప్రచారం చేసి, కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని తేల్చిచెప్పారు. పదవీ విరమణ వయస్సు ను పెంచుతూ వెళ్తుంటే నిరుద్యోగులు ఏం కావాలని ప్రశ్నించారు.