హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ హైదరాబాద్లో ఈ నెల 19, 20న హ్యాకథాన్ నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. హ్యాకథాన్ను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆదివారం గడువు ముగిసింది. యూనివర్సిటీలో డైరెక్టరేట్ ఆఫ్ ఆంత్రపెన్యూర్షిప్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఆధ్వర్యంలో హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హ్యాకథాన్లో భాగంగా మొత్తం 50 ఇన్నోవేషన్లను ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు.