JNTU | హైదరాబాద్ : పాలేరు(ఖమ్మం), మహబూబాబాద్‌లో జేఎన్టీయూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీటెక్‌లో ఐదు కోర్సులతో జేఎన్టీయూ కాలేజీలు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. సీఎస్ఈ, డేటా సైన్స్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ కోర్సులతో కొత్త కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున కేటాయించారు. ఈ కొత్త కాలేజీల్లో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ త్వరలో ప్రారంభంకానుండగా, ఈ కౌన్సిలింగ్లో ఈ కాలేజీలోని సీట్లను భర్తీచేస్తారు. ఈ విద్యాసంవత్సరంలో చేరిన వారు.. 2026 -27లో బీటెక్‌ను పూర్తిచేసి, పట్టాను పొందుతారు.
కొత్తగా జేఎన్టీయూ కాలేజీలు మంజూరు కావడంతో పాలేరు, మహబూబాబాద్ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఉండే గ్రామీణ విద్యార్థులకు ఈ కాలేజీలు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు.